తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 94 నుంచి 104 సీట్లు గెలిచి అవకాశం ఉందని చెప్పింది సీపీఎస్ (సెంటర్ ఫర్ సెపాలజీ స్టడీస్ ) సర్వే. తాజాగా ఈసర్వే చేపట్టిన ఫలితాలను నేడు విడుదల చేశారు.అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని పలు సంస్థల సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరు, తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సంతృప్తి చెందిన ప్రజలు తిరిగి మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారని సర్వే చెప్పింది.
తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలలోని 119 నియోజకవర్గాల్లో 2,86, 567 మందిని పైగా సంప్రదించి శాంపిల్స్ తీసుకుంది. ఇందులో 52.7 శాతం మంది పురుషులు, 47.3శాతం మంది స్త్రీలు ఉన్నారు.సర్వే ప్రకారం గులాబీ దళానికి 49.7 శాతం ఓట్లు, మహాకూటమికి 32.3 శాతం ఓట్లు, బీజేపీకి 9.1 శాతం, ఎంఐఎంకు 2.4 శాతం ఓట్లు, ఇతరులకు 6.5 శాతం ఓట్లు రానున్నాయని ఈ సర్వే చెబుతోంది. టీఆర్‌ఎస్‌కు 94 నుంచి 104 సీట్లు రాగ, మహాకూటమికి 16-21 సీట్లు రాబోతున్నాయని, బీజేపీకి 1-2 సీట్లు వస్తాయని, ఎంఐఎంకు 7 సీట్లు, ఇతరులు ఒక చోట గెలిచే అవకాశాలు ఉన్నాయని సీపీఎస్ సర్వే తేల్చింది.