బర్త్ డే…మొక్కలు నాటిన వినోద్ కుమార్

119
vinod

తన పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుమేరకు భద్రాచలం శ్రీరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్ .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అందరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని రక్షించాలి అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందు తీసుకోబోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తన సతీమణి డాక్టర్ బోయినపల్లి మాధవి, కుమారులు ప్రతీక్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.