- Advertisement -
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జైత్రయాత్ర గాంధీ నగర్ డివిజన్ నుండే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. గాంధీ నగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి ముఠా పద్మ నరేష్‌తో కలిసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత…కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ మార్గనిర్దేశనంలో గాంధీ నగర్ లో అభివృద్ధి చేశారు.67 వేల కోట్లతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం.కరోనా వచ్చిన, వరద వచ్చిన ప్రజలకు టిఆర్ఎస్ అందుబాటులో ఉండి అందర్ని ఆదుకుందన్నారు.
పేదలకు, వరద బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు….కాంగ్రెస్, బీజేపీ పేద ప్రజల నోటి కాడి ముద్దను లాక్కున్నరు..జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు, కాంగ్రెస్, బీజేపికి లేదు…జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు నగర ప్రజలను పట్టించుకోలేదన్నారు.
- Advertisement -