హ్యాట్రిక్‌ కొడతాం: కేటీఆర్

137
ktr
- Advertisement -

తెలంగాణలో మూడోసారి అధికారాన్ని చేపట్టి హ్యాట్రిక్ కొడతామన్నారు మంత్రి కేటీఆర్.ట్విట్టర్‌లో Ask KTR కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…తెలంగాణలో మరోపార్టీకి అవకాశం లేదని, మూడోసారి కూడా టీఆర్‌ఎస్సే గెలుస్తుందన్నారు.

కేంద్రం తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని బీజేపీ అమ్ముకుంటోందని… బీజేపీ అంటే బేచో జనతాకి ప్రాపర్టీ అని కొత్త అర్ధాన్ని చెప్పారు కేటీఆర్. గ్యాస్‌ ధరల్లో ప్రధాని ప్రపంచ రికార్డ్‌ సృష్టించారు. ఈ విషయంలో ఆయన్ను ఎవరు ఆపలేకపోతున్నారు. డీజిల్‌ 100 దాటింది.. గ్యాస్‌ వెయ్యి దాటింది.. ఇవి చరిత్రలో నిలిచిపోతాయన్నారు.

మిషన్‌ భగీరథ కోట్లాది మంది ప్రజల గేమ్ ఛేంజర్‌. ఏడేళ్లలో 120 శాతం వ్యవసాయం పెరిగింది. 24 గంటల విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమాతో సాధ్యమైందన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీ మొదట అమేథీలో గెలవడం పై దృష్టి పెట్టాలని చురకలు వేశారు.

- Advertisement -