ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రేపటితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి నామినేషన్ ముగియనుండటంతో తిరుపతి పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ సాయంత్రం గుత్తా పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. జిల్లా రాజకీయాలపై మంచిపట్టుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో త్వరలోనే గుత్తకు పెద్ద పదవి రాబోతుందంటూ(మంత్రిపదవి)పై హింట్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే తొలుత స్ధానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన పేరు దాదాపుగా ఖరారైందనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా తేరా చిన్నపరెడ్డిని బరిలో దించారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని గుత్తాకు తెలిపిన సీఎం ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనన తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా ఉన్నారు.