మొక్కలు నాటిన TRS రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్..

145
Green India Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టీఆర్‌ఎప్‌కేవీ వ్యవస్థాపక అధ్యక్షుడు,టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్.రూప్ సింగ్ తన పుట్టినరోజు పురస్కరించుకుని సోమవారం తెలంగాణ భవన్ ఆవరణలో మొక్క నాటారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ కార్మిక విభాగం సభ్యులు పాల్గొన్నారు.

ఆ సందర్భంగా రూప్ సింగ్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ పిలుపుమేరకు గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉంది అన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షించాలి. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్‌ తరాలకు మేలు చేకురుతుంది అని రూప్‌ సింగ్‌ అన్నారు. ఈ ఛాలెంజ్‌లో పాల్గొని పుట్టిన రోజు సందర్భంగా అందరూ మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -