మీసేవకు సెల్యూట్..ఎన్నిసార్లు చెప్పినా తక్కువే

295
santhu
- Advertisement -

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా.. తనవంతు బాధ్యతగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ మేరకు సామాజిక కార్యక్రమాలే కాదు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీసులు, డాక్టర్లు చేస్తున్న సేవలను కొనియాడారు.

తాజాగా మరోసారి డాక్టర్లు చేస్తున్న సేవలను గుర్తుచేస్తూ ప్రశంసలు గుప్పించారు సంతోష్. ఎన్నిసార్లు..ఎంత పొగిడిన మీరు చేస్తున్న సేవలకు తక్కువే అంటూ కరోనా పాజిటివ్ వ్యక్తులకు ట్రీట్ మెంట్ ఇస్తున్న మహిళా డాక్టర్ ఫోటోను షేర్ చేశారు. 7 నెల గర్భవతి అయిన డాక్టర్ కరోనా సోకిన వ్యక్తికి సేవ చేస్తుండటం గొప్పవిషయమని ఆమెకు అందరు సెల్యూట్ చేయాలని ట్విట్టర్ వేదికగా కోరారు.

- Advertisement -