10వ రోజు.. ఎంపీ సంతోష్ అన్నదానం..

410
- Advertisement -

సాయం చేయడం అంటే మనకు తోచినప్పుడు తోచినంత సాయంచేయడం కాదు … ఎదుటివారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చెయ్యాలి. అందులో ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టడం చాలా గొప్ప విషయం. లాక్ డౌన్ సందర్బంగా వలస కూలీలు, పేద ప్రజలు ఆకలితో అలమటించద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ బోయినిపల్లి మండలం కోదురుపాక తన స్వంత గ్రామంలో ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వలస కార్మికుల అన్నదానం క్యాంప్ 10వ రోజుకు చేరింది.

వలస కార్మికుల కోసం ఈ అన్నదాన క్యాంప్ లాక్‌డౌన్ పూర్తి అయ్యేవరకు భోజనాలు పెడతామని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి అని తెలిపారు. అన్నదాత సుఖీభవ అన్నారు పెద్దలు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న సంతన్నకి మా కృతజ్ఞతలు అని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామశాఖ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చిక్కల సుధాకర్ రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఒద్దెల మహేందర్, బొల్లావేని తిరుపతి, సందుల శ్రీనివాస్, చింతలపల్లి తిరుపతి రెడ్డి, కత్తెరపాక సుధాకర్, ఆకుల కర్ణకర్, నాగుల నాగరాజు, రాజిరెడ్డి, సారంపెళ్లి రవి, కమల్, సిద్ధాంతి కళాధర్, గుండ్ల సాయబు పాల్గొన్నారు.

- Advertisement -