ఆగని టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు..

34
- Advertisement -

కేంద్రం పెంచిన ధరలు, జీఎస్టీ భారాలపై టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు ఇవాళ కూడా కొనసాగాయి. పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ప్ల కార్డులతో నిరసనకు దిగారు. అధిక ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్‌సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, నేతకాని వెంకటేష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాములు, దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -