ఈ సభ దేశచరిత్రలో నిలిచిపోవాలి: కేసీఆర్‌

265
KCR
- Advertisement -

సెప్టెంబర్ 2న టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ లో ని కొంగరకలాన్‌ లో 1600 ఎకరాలు అందుబాటులో ఉండటంతో ఈ బహిరంగసభను అక్కడే నిర్వహించాలి సీఎం నిర్ణయించారు. అందులో సభావేదిక, బారికేడ్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించారు. కాగా సభ విజయవంతానికి కమిటీలను ఏర్పాటుచేయాలని, బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సహచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. TRS Party Pragati Nivedana Sabha On September 2దాదాపు ఏడుగంటలపాటు సాగిన ఈ సమావేశంలో.. ప్రస్తుతం నెలకొన్న కేంద్ర, రాష్ట్ర రాజకీయాలపైనా ముఖ్యమంత్రి లోతుగా చర్చించారని సమాచారం. రైతులందరూ సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వందకు పైగా అసెంబ్లీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలన్నీ చెప్తున్నాయని సీఎం అన్నారని తెలిసింది. ప్రగతినివేదన సభ ఏర్పాట్లపై టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ, శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశాన్ని శుక్రవారం నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశం జరుగనుంది. సంయుక్త సమావేశం ఈ నెల 17నే జరుగాల్సిన ఉన్నా, వర్షాల కారణంగా వాయిదావేసిన సంగతి తెలిసిందే.

కాగా..ప్రజల్లో పార్టీకి సానుకూలమైన వాతావరణం ఉందని మంత్రులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారని సమాచారం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. అనుసరించాల్సిన వ్యూహం, కేంద్రంలో రాజకీయ పరిణామాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై తీసుకువస్తున్న వత్తిడిని సీఎం వివరించినట్టు తెలిసింది.

TRS

వారం రోజులుగా కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో..రిజర్వాయర్లు నిండుకుండల్లా మారుతున్నాయని, ఎస్సారెస్పీకి కూడా ఆశాజనంగా నీళ్లు వస్తుండటంతో ఈ ఏడాది మంచి పంటలు పండుతాయని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారని సమాచారం. డబుల్ బెడ్రూం ఇండ్లు, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా తదితర కీలక పథకాల అమలు, ప్రజల్లో వాటిపై సానుకూలతపైనా మంత్రులతో సీఎం చర్చించినట్టు తెలిసింది.

ఇదిలా ఉండగా..సభ ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ.. సభలో చివర ఉన్నవారికి సైతం బహిరంగసభ స్పష్టంగా కనపడటానికి వీలుగా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలని, అలాగే సభకు తరలివచ్చేవారికి ఏర్పాట్లు చేయడానికి జిల్లాలవారీగా మంత్రులు జిల్లాల ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలని చెప్పారు. భారీ బహిరంగసభల నిర్వహణలో టీఆర్‌ఎస్ గతంలో అనేక చరిత్రలను తిరుగరాసిందని చెప్తూ.. వరంగల్‌లో ఉద్యమ సమయంలో నిర్వహించిన భారీ బహిరంగసభను గుర్తుచేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో నిర్వహించే సభ దానికి దీటుగా, దేశ చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలన్నారు.

ఇక..రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆదిభట్ల మున్సిపాల్టీ పరిధిలోని కొంగరకలాన్‌లో నిర్వహించే ఈ సభ, ఔటర్ రింగురోడ్డుకు సమీపంలో ఉన్నందున వివిధ జిల్లాల నుంచి వచ్చేవారికి అనువుగా ఉండటంతోపాటు నగరంలో ట్రాఫిక్ జామ్‌లకు ఆస్కారం ఉండదనే అంచనాతో ఈ ప్రాంతాన్ని ఖరారుచేసినట్టు తెలిపారు.

- Advertisement -