అర్జున్ రెడ్డి ని మించిన గీత గోవిందం..!

207
Geetha Govindam First Week Collections
- Advertisement -

విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన గీత గోవిందం చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయభేరి మోగిస్తోంది. అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దుమారం రేపుతోంది. ఆగష్టు 15 న విడుదలైన ఈ సినిమా మొదటి వారం లో 65 కోట్ల గ్రాస్ వసూలుచేసింది. ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే 8.50 కోట్లు వసూలు చేసి ట్రేడ్ పండితులచేత ఔరా అనిపించుకుంటుంది. ఆగష్టు 15 న ఈ చిత్రాన్ని విడుదల చేయటం, వారం పూర్తికాగానే బక్రీద్ తో సెలవు రోజు రావటం ఈ సినిమా కలెక్షన్లకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. మొత్తం మీద 8 రోజుల్లో 73.5 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సంపాదించి తెలుగు సినీ రికార్డ్స్ తిరగరాయడానికి పూనుకుంది. ఇంత ఘనవిజయం సాధించిన ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే.Geetha Govindam First Week Collections

బన్నీవాస్ నిర్మాణ సారధ్యంలో, గీత ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాని కేవలం 5 కోట్లతో తెరకెక్కించడం ఆశ్చర్యకరం. సినిమా దర్శకుడు పరశురామ్ కేవలం కథ పై, కథనం పై మాత్రమే దృష్టి పెట్టి మిగిలిన ఆడంబరాలకు దూరంగా సినిమాను తెరకెక్కించి తన సత్తా నిరూపించుకున్నాడు. అర్జున్ రెడ్డి తో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ డం సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రావడం, అదీ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి గీత ఆర్ట్స్ బ్యానర్ పై రావడం ఈ సినిమాకి మంచి ప్రాముఖ్యతను ఏర్పరచాయనే చెప్పాలి.

చూస్తూ ఉంటే అర్జున్ రెడ్డి ని మించిన వసూళ్ళను రాబట్టడం లో గీత గోవిందం ఏ మాత్రం తీసిపోదనే చెప్పుకోవచ్చు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సినీ రంగం లో మళ్ళీ తన మార్క్ వేసుకున్నాడని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. హీరోయిన్ రష్మిక కూడా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి సినిమా రేంజ్ ని పెంచడంలో సహాయపడింది.

ఈ సినిమాను 15 కోట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఈ 8 రోజుల గ్రాస్ లో షేర్ 40 కోట్ల వరకు రాగా 25 కోట్ల లాభం తో డిస్ట్రిబ్యూటర్లు సంబరపడిపోతున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను దాటి రికార్డ్స్ ని తిరగరాస్తుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు..

- Advertisement -