ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం…

284
trs bhavan
- Advertisement -

దేశరాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలం కోసం పార్టీ ఎంపీలు,ప్రముఖ వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ స్థలాలను పరిశీలించారు. సీఎం కేసీఆర్ సైతం ఇవాళ పార్టీ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం.

నిబంధనల ప్రకారం టీఆర్ఎస్‌ పార్టీకి దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి వెయ్యి గజాల ప్రభుత్వ స్థలం కేటాయించే అవకాశం ఉంది. ప్రభుత్వం కేటాయించే స్థలంలో టీఆర్ఎస్‌ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. సంక్రాంతి తర్వాత కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనుండగా మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించేలా సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా వరంగల్‌లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శంకుస్ధాపన చేశారు. త్వరలో మిగితా జిల్లాల్లో పార్టీ ఆఫీసులకు శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా ప్రారంభించనున్నారు.

- Advertisement -