రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నేడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు శంకుస్ధాపన చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 మధ్యలో మంచి ముహూర్తం ఉన్నందున ఆ సమయంలోనే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఒక్కో జిల్లాకు ఎకరం చొప్పున భూమి కేటాయించిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. . ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ గత ఏడాది డిసెంబర్ 20న వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.
మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మంత్రులు.. మంత్రులు లేని చోట్ల జిల్లా పరిషత్ చైర్మన్లు పార్టీ కార్యాలయాలకు భూమి పూజ చేయనున్నారు. అయితే ఇప్పటి వరకే టీఆర్ఎస్ పార్టీకి కేవలం ఖమ్మం, వనపర్తి జిల్లాల్లోనే పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఒక్కో జిల్లా కార్యాలయానికి రూ.60 లక్షల చొప్పున పార్టీ అధిష్ఠానం కేటాయించింది. అన్ని కార్యాలయాలు ఒకే నమూనాతో నిర్మించనున్నారు. ఇక జిల్లాలవారీగా ఏ రోజుకు ఆరోజే వివరాలన్నింటిని తెప్పించి డిజిటలైజ్ చేయలాని కూడా టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 27 న పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నారు.