రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు..

177
trs
- Advertisement -

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ రాజ్‌ న్యూస్‌ చానల్ పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సోమవారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోను భరత్ కుమార్ తదితరులు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పార్థసారథిని కలిశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న రాజ్‌ న్యూస్‌ ఛానల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా టీఆర్‌ఎస్‌ కోరింది. ఎస్‌ఈసీని కలిసి విజ్ఞాపన పత్రం అందజేసింది.

రాజ్‌న్యూస్‌ ఛానల్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు ఛానల్‌పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోను భరత్‌కుమార్‌, కల్యాణ్‌రావు, రాము పాల్గొన్నారు.

- Advertisement -