పసి పాప ప్రాణం నిలబెట్టిన సూప‌ర్ స్టార్..

101
mahesh

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనే కాదు బయట కూడా హీరో అనిపించుకుంటున్నారు. ఆయన గొప్ప మనసున్న మనిషి అని చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు. పలు సేవాకార్యక్రమాలు చేపడుతూ నిజమైన సూపర్ స్టార్ గా నిలిచారు. శ్రీమంతుడు సినిమా తర్వాత రెండు గ్రామాలను దత్తతు తీసుకున్నారు మహేష్. ఆయన సతీమణి నమ్రత ఆ గ్రామాల అభివృద్ధిని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. అదే విధంగా వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి ఎన్నో పసి ప్రాణాలను కాపాడారు మహేష్.

తాజాగాఏపీకి చెందిన డింపుల్ అనే చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేష్ బాబు భరించారు. ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధి వచ్చింది. దానికి ట్రీట్ మెంట్ కూడా ప్రారంభించారు. ఖ‌ర్చుల‌న్నీ మ‌హేష్ భ‌రించ‌గా, ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుందని.. ఆ చిన్నారికి, తన ఫ్యామిలీకి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్రత ఈసందర్భంగా ట్వీట్ చేశారు. కాగా, మ‌హేష్ ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట అనే చిత్రంతో బిజీగా ఉన్నారు.