కేటీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన పార్లమెంటరీ పార్టీ సమావేశం

254
ktr

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈసమావేశం జరుగుతుంది. సమావేశానికి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు.

కాగా ఈనెల 18నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈసమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన నిధులపై పార్లమెంట్ లో ప్రస్తావించాలనే అంశంపై ఎంపీలతో చర్చించనున్నారు మంత్రి కేటీఆర్.