కరీంనగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం

235
Road Accident

కరీంగనర్ రూరల్ మండలం ఇరుకుల్ల రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆర్టీసీ బస్సు ఢికొట్టడంతో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడ్డవారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో బస్సు డోర్ ఓపెన్ కాకపోవడంతో అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు స్ధానికులు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా మరో 15మంది స్వల్ప గాయాలయ్యాయి.

మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ రాజధాని ఎక్స్ప్రెస్ మంచిర్యాల నుంచి కరీంనగర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ ముందు వెళ్తూ ఉండగా రెండు లారీల మధ్య బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ముందు ఉన్న లారీని ఢీ కొట్టగా వెనకాల నుంచి లారీ బస్సు ఢీ కొట్టింది. బస్సు తో పాటు ఈ ప్రమాదంలో మరో మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.