- Advertisement -
ఈ నెల 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్లో జరిగే ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశం సీఎం అధ్యక్షతన జరగనుంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం,లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి లోక్ సభ,రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు. ఈ నెల 17న అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం జరగనుంది.
- Advertisement -