కూకట్ పల్లిలో బ్యాంకు ఉద్యోగి పై దాడి

375
kukatpally

హైదరాబాద్ కూకట్‌పల్లిలో బ్యాంకు ఉద్యోగిపై దాడి జరిగింది. విధులు నిర్వహించి ఇంటికి వెళ్తున్న రాజేశ్ అనే ప్రైవేటు బ్యాంకు ఉద్యోగిని చంపే యత్నం చేశారు. రోడ్డు పై బైకులు అడ్డుగా పెట్టి మద్యం సేవిస్తున్న కొంతమంది దారి ఇవ్వాలన్నందుకు రాజేశ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. అడ్డొచ్చిన మహిళలపై దాడి చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు.

కూకట్ పల్లి విజ్ఞాన్ పురి లో నివసించే కమేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఈనెల 5వ తేదీన రాజమండ్రి వెళ్లి ఇవాళ ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో చూడగా 25 తులాల బంగారం,2కేజీ ల వెండి,15 వేల నగదు పోయినట్టుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.బాధితడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.