టీఆర్ఎస్ సన్నాహాక సమావేశాలు.. సర్వం సిద్ధం

254
- Advertisement -

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సన్నాహాక సమావేశాలకు సర్వం సిద్ధమైంది.16 ఎంపీ స్ధానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. రేపటి నుండి(మార్చి 6) నుండి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం కానున్నారు. టీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలని..?గత ఐదేండ్లలో ఎంపీలు ఏం చేశారు..?16 స్ధానాల్లో టీఆర్ఎస్ గెలిస్తే కార్యాచరణ ఎలా ఉండబోతుందో అన్న అంశాలను సవివరంగా తెలపనున్నారు.

తొలి సమావేశం కరీంనగర్‌లో జరగనుండటంతో మంత్రి ఈటల రాజేందర్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గం నుండి 3 వేల మంది కార్యకర్తలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి సికింద్రాబాద్ నుంచి రైలు సౌకర్యం, గజ్వేల్ వరకు రైల్వేలైను పనులు చేపట్టడం, మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బయ్యారం ఉక్కు పరిశ్రమపై టీఆర్‌ఎస్ ప్రభుత్వ పోరాటం, భవిష్యత్ వ్యూహం గురించి వివరించనున్నారు.

ఇప్పటికే ఎన్నికల బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించారు. మంత్రులులేని జిల్లాల్లో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. మార్చి 7న వరంగల్,భువనగిరి,మార్చి 8న మెదక్,మల్కాజ్‌గిరి,మార్చి 9న నాగర్‌కర్నూలు,చేవెళ్ల,మార్చి 13న జహీరాబాద్,సికింద్రాబాద్,మార్చి 14న నిజామాబాద్,ఆదిలాబాద్,మార్చి 15న పెద్దపల్లి,మార్చి 16న మహబూబాబాద్,ఖమ్మం,మార్చి 17న నల్లగొండ,మహబూబ్ నగర్‌ నియోజకవర్గాల సమావేశం జరగనుంది. కరీంనగర్ నుండి టీఆర్ఎస్ ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతం అవుతుండటంతో మరోసారి ఇక్కడినుండే పార్లమెంట్ ఎన్నికల శంఖారవం పూరించనున్నారు కేటీఆర్.

- Advertisement -