సంక్షేమం అమలులో దేశంలోనే నెం1: సీఎం కేసీఆర్

384
cmkcr
- Advertisement -

సంక్షేమం అమలులో అమలులో దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం పర్యటనలో భాగంగా ధర్మపురిలో మీడియాతో మాట్లాడారు..ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉందని, గోదావరి అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. గోదావరి నదిలో దాదాపు 100 టీఎంసీల నీరు 250 కిలోమీటర్ల మేర నిలిచిందని చెప్పారు. అనుకున్న దాని కంటే బ్రహ్మాండంగా ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. తెలంగాణ భవిష్యత్‌ కోసం శాశ్వత సాగునీటి వనరులు సమకూరుస్తున్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

44 ఏళ్ల సీడబ్ల్యూసీ రికార్డులను పరిశీలించి ప్రాజెక్టులు రీడిజైనింగ్‌ చేశామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా లభించే నీళ్లు 400 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. నెలకు 60 టీఎంసీల చొప్పున 6 నెలలపాటు నీటిని ఎత్తిపోస్తం. రామగుండం నుంచి అదనంగా 4వేల మెగావాట్ల కరెంట్‌ వస్తుంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ప్రతీ రోజు 3 టీఎంసీల నీళ్లు వస్తయన్నారు.

మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి అధికారులు, మంత్రులు వస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఒడిశా రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి స్పూర్తిగా తీసుకొని అమలు చేస్తున్నట్టుగా ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ మీడియా ముందు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తుపాకులగూడెం, దుమ్ముగూడెం ప్రాజెక్టులు కూడ త్వరలోనే పూర్తి కానున్నట్టుగా సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల 100 కి.మీ. దూరంలో గోదావరి నీటిని ఒడిసిపట్టుకొనే అవకాశం ఉందన్నారు.

- Advertisement -