ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే….

293
TRS NRI For TRS Cheif KCR
- Advertisement -

ఎన్నారైలంతా టీఆర్ఎస్ అధినేత,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు అనిల్ కుర్మాచాలం. ఎన్నారై టీఆర్ఎస్ యుకే ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తామని చెప్పారు. ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు అని కొనియాడారు.

టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ అని, నాడు రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, నేడు అదే స్పూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణం లో రెట్టింపు త్యాగాలు చేస్తోందన్నారు. ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమవుతుందన్నారు.

ముందస్తు ఎన్నికల్లో ఎన్నారై టీఆర్ఎస్ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొంటుందన్నారు. టీఆర్ఎస్ విజయానానికి కృషి చేస్తామని తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడటమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 32 పైగా దేశాల్లో టి.ఆర్.యస్ ఎన్నారై శాఖలు ఏర్పడ్డాయని, ఎన్నారై కో- ఆర్డినేటర్ మహేష్ బిగాల తో చర్చించి యావాత్ ఎన్నారై తెరాస ఆధ్వర్యం లో ప్రత్యేక ప్రచార ప్రణాలికను సిద్ధం చేసుకుంటామని తెలిపారు.

ఎన్నారై ల సమస్యల పైన ముఖ్యంగా గల్ఫ్ సమస్యలు వాటి పరిష్కారానికి సూచనలతో, ఇతర దేశాల ఉన్న ఎన్నారై మిత్రులని సంప్రదించి, వివిధ దేశాల్లో ఉన్న సమస్యలని అడిగి తెలుసుకొని టీ.ఆర్.యస్ పార్టీ మేనిఫెస్టో కమిటీకి ప్రత్యేక నివేదిక ఇస్తామని తెలిపారు.

ఇక రాబోయే రోజుల్లో వివిధ రకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించడమే కాకుండా, వినూత్నంగా టి.ఆర్.యస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరిస్తూ కెసిఆర్ గారి నాయకత్వ అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు..

టి.ఆర్.యస్ పార్టీ ఏర్పాటు చేసిన “ప్రగతి నివేదన సభ” మరియు “ప్రజా ఆశీర్వాద సభ” లను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సమావేశం లో ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ,కార్యదర్శులు సృజన రెడ్డి చాడ మరియు సత్యమూర్తి చిలుముల, సంయుక్త కార్యదర్శి బండ సతీష్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -