సుష్మా స్వరాజ్ మరణం తెలంగాణకు తీరని లోటుః ఎంపీ కేశవరావు

498
trs Mps Tribute sushma Swaraj
- Advertisement -

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సినీయర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ గుండెపొటుతో నిన్న రాత్రి మృతి చెందిన సంగతి తెలిసందే. ఈసందర్భంగా ఆమె పార్దివ దేహానికి పలువురు నాయకులు నివాళులర్పించారు. తెలంగాణ ఎంపీలు కేశవరావు, బండ ప్రకాశ్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, పసునూరి దయాకర్ సుష్మా స్వరాజ్ పార్ధివదేహానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎంపీ కేశవరావు మాట్లాడుతూ..దేశం ఒక గొప్ప నేతను కొల్పోయిందన్నారు.

తెలంగాణ బిల్లు అంశంలో ఆమె ఎంతో సహాయం చేశారని గుర్తు చేశారు. సుష్మా స్వరాజ్ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు. ఆమె బాధ్యతల పట్ల ఎంతో గౌరవంగా ఉండేదన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. సుష్మాస్వరాజ్ మృతితో దేశం ఒక మంచి నేతను కోల్పోయిందన్నారు ఎంపీ బీబీ పాటిల్. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రజల తరుపున ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు తెలిపారు .

- Advertisement -