బీజేపీ రైతు వ్యతిరేక సర్కార్: ఎంపీ కేశవరావు

95
keshavarao
- Advertisement -

బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు ఎంపీ కేశవరావు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలో టిఆర్ఎస్ ఎంపీలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేశవరావు…దుర్భరమైన పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. తెలంగాణలో రెండు పంటలు పండుతాయి…రబీలో పండే వరి పంట వాతావరణ పరిస్థితుల వల్ల బాయిల్డ్ రైస్ గా చేసి కేంద్రానికి ఇస్తున్నాం అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నీరు, విద్యుత్,పెట్టుబడి సాయం.ఏ పంటలు వేయాలో అధ్యయనం చేస్తూ పంట ఉత్పత్తి సామర్ధ్యం పెంచాం అన్నారు.

62 లక్షల ఎకరాల్లో పంట సాగు ఉంది…ధాన్యం తీసుకోవాలని చెప్తుంటే మీరు ఇంత ధాన్యం ఎలా పండిస్తారు అని కేంద్రం అంటుంది…రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం ఇది అన్నారు. పంటల సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలి..ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం స్పష్టం చేయాలన్నారు. ఎంఓయు ప్రకారం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం అంటుంది..తెలంగాణ నుంచి కోటి టన్నులు ధాన్యం ఇస్తాం తీసుకోండి.. ఇది దేశానికే ప్రయోజనం అని తెలిపారు.

మొత్తం కోటి టన్నుల ధాన్యాన్ని సేకరించాలి..కేంద్రం స్పష్టత ఇస్తే పంటల మార్పిడి అంశాన్ని రైతులకు వివరిస్తాం అన్నారు. రెండు మూడేళ్ళ సమయం ఇస్తే పంట మార్పిడి వైపు రైతులు మళ్లుతారు…అంతవరకు బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం అన్నారు. కేంద్రం కొనుగోలు చేయకపోవడం వల్ల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు….కేసీఆర్ చేసిన తప్పేంటి..?లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడమా? అని ప్రశ్నించారు.

- Advertisement -