- Advertisement -
లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కలిశారు టీఆర్ఎస్ ఎంపీలు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ప్రభత్వంపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పీకర్ కు తెలియజేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను టార్గెట్ గా చేసుకుని పలువురు సభ్యులు లోక్ సభలో ప్రస్తావిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లోక్ సభలో ప్రస్తావిస్తున్నారని స్పీకర్ కు తెలియజేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రశ్నించడానికి అసెంబ్లీ ఉందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు లేవనెత్తిన అంశాలను పార్లమెంట్ రికార్డు నుంచి తొలిగించాలని స్పీకర్ ను విజ్నప్తి చేశారు.
టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న అభివృద్ది చూసి ఓర్వలేకనే తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. వాళ్లు సమస్యలు వదిలి పెట్టి కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిడం ఎంత వరకూ సమంజసం అన్నారు.
- Advertisement -