తిరిగి  షూటింగ్ లో పాల్గోన్న నాగ‌శౌర్య‌

136
Nagashowra

ఐరాక్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం 3 గా తెర‌కెక్కిస్తున్న చిత్రం షూటింగ్ వైజాగ్ లో జ‌రుగుతుండ‌గా హీరో నాగ‌శౌర్య కాలికి గాయం అయిన విష‌యం తెలిసిందే.. ఆ త‌రువాత హైద‌రాబాద్ చేరుకుని రెస్ట్ తీసుకున్నారు. డాక్ట‌ర్ ల స‌లహ మేర‌కు చిన్న స‌ర్జ‌రి జ‌రిగింది. ఇటీవ‌ల త‌ను న‌టించిన ఓ బేబి ఫంక్ష‌న్ కి హ‌జ‌ర‌య్యారు. యాక్సిడెంట్ అయిన త‌రువాత మెద‌టిసారిగా ఓబేబి ఫంక్ష‌న్ కి మాత్ర‌మే వ‌చ్చారు.

Iyra

కాలు జాయింట్ ద‌గ్గ‌ర న‌రాలు చిట్ల‌డం తో దాదాపు నెల రొజుల పాటు విశ్రాంతి తీసుకొవాల‌ని డాక్ట‌ర్లు చెప్పారు.  ఇప్ప‌డు కూడా ఆర్టిస్టులు డేట్స్ ఎడ్జ‌స్ట్మెంట్ స‌మ‌స్య కాకూడ‌దు అని భావించి షూటింగ్ కి హ‌జ‌ర‌య్యారు. ఈరోజు నుండి హైద‌రాబాద్ లోని మ‌ల‌క్‌పేట ప్రాంత్రంలో షూటింగ్ కార్య‌క్ర‌మాలు మెద‌లు పెట్టారు. మెద‌టి షాట్ కూడా హీరో నాగ‌శౌర్య మీదనే చిత్రీక‌రించారు.

ఛ‌లో లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌స్తున్న ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  నాగ‌శౌర్య కి యాక్సిడెంట్ జ‌రిగింద‌ని తెలుసుకున్న‌యూనిట్ సభ్యులు హీరో ని ప‌ర్స‌న‌ల్ గా క‌లిసి త్వ‌ర‌గా కొలుకొవాల‌ని కొరుకున్నారు. నిర్మాత ఉషాముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ విజ‌న్ త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ చిత్రంలో నాగ‌శౌర్య కి జంట‌గా మెహరీన్ నటిస్తుంది.