రెండు రోజుల్లో టీఆర్ఎస్ ఎంపీల జాబితాను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో పాటు పార్లమెంట్ స్ధానాలను క్లీన్ స్వీప్ చేయడంపై పలు సూచనలు చేశారు.
నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్ధులకు మెజార్టీ తీసుకొచ్చే బాధ్యతలను అప్పగించారు. పార్టీ మొత్తం సీట్లు గెలుచుకుని రావాలని ఆదేశించారు. త్వరలో మొత్తం 16 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని కేసీఆర్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. సమన్వయంతో వర్గపోరుకు దూరంగా పార్టీకోసం పనిచేయాలన్నారు.
17న కరీంనగర్‌లో, 19న నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపు తెలంగాణ భవన్ నుండి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరనున్నారు ఎమ్మెల్యేలు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల రేసు నుండి కాంగ్రెస్ తప్పుకోవడంతో టీఆర్ఎస్,ఎంఐఎం 5 స్ధానాల్లో గెలవడం లాంచనమే కానుంది.