కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన..

193
trs
- Advertisement -

వ్యవసాయ సంబంధిత బిల్లుల ఆమోదంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. బిల్లుల ఆమోద సమయంలో ఆందోళనకు దిగిన 8మంది సభ్యుల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు నిరసనకు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు.ప్రజాస్వామ్యాన్ని కూని చేసారంటూ నినాదాలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులను వాపస్ తీసుకోవాలని టీఆర్ఎస్‌ సభ్యులు డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డుల ప్రదర్శన చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కె కేశవరావు మాట్లాడుతూ.. మేము అంత రైతుల, వారి హక్కుల గురించి పోరాడుతున్నాం. రైతుల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.సభ్యుల సస్పెన్షన్ రాజ్యాంగం, రూల్స్ కు వ్యతిరేకంగా ఉంది. రాజ్యసభ చైర్మన్ ఇవాళ 256 రూల్ చదివారు.. అలాగే 252 రూల్ కూడా చదవాలి. 252 రూల్ ప్రకారం బిల్లుపై ఓటింగ్ జరగాలి. డివిజన్ ఓటింగ్ ఆడిగము ఇవ్వలేదు. అప్రజాస్వామికంగా సభ్యులను సస్పెండ్ చేశారని కేకే వ్యాఖ్యానించారు.

- Advertisement -