సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కవితక్క

658
- Advertisement -

తెలంగాణ ఆడపడుచులు ఉత్సాహంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి. ఇప్పటికే ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మలతో.. ఈ ఎనిమిది రోజులు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం(నేడు)తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వ‌హిస్తున్నారు.

TRS MP Kavitha

ఈ సందర్భంగా ఎంపీ కవిత సోషల్ మీడియాలో స్పందించారు. ఈ రోజుతో తొమ్మిది రోజుల పూల జాతర పతాక స్థాయికి చేరుకొని, వైభవంగా సద్దుల పండుగతో ముగుస్తుందని ఎంపీ కవిత పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పూల పరిమళాలు, పాటల మధురిమలు, ఆటల ఉత్సాహం సంవత్సరమంతా మీతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ట్విటర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -