సీబీఐ లేఖకు స్పందించిన :కవిత

207
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు…తాజాగా తెలంగాణకు పాకింది. దీంతో సంబంధం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అయితే శుక్రవారం సీబీఐ అధికారులు సీఆర్పీసీ సెక్షన్ 160ప్రకారం నోటీసు ఇస్తూ…క్లారిఫికేషన్‌ కోసం తమ వద్దకు రావాలని అనుకుంటున్నామని సీబీఐ సమాచారం ఇచ్చింది. ఈ లేఖకు స్పందించిన కవిత సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి శనివారం లేఖ రాశారు. సీబీఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి…

ధరణితో రైతు కష్టాలు దూరం:హరీశ్

సైబర్‌ నేరాలను అరికట్టాము:కేటీఆర్‌

దివ్యాంగులకు అండగా టీఎస్ సర్కార్..

 

 

- Advertisement -