అక్టోబర్‌15,16న సాహిత్య సభలు :ఎమ్మెల్సీ కవిత

75
kaloji kavitha
- Advertisement -

తెలంగాణ సాయుధ పోరాటంలో సాహిత్య సేవలు చేసిన పోరాటంలో భాగంమైన… ప్రజాకవి కాళోజీని స్మరించుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 15, 16వ తేదీల్లో సాహిత్య సభలు నిర్వహించనున్న‌ట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కాళోజీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని త‌న నివాసంలో కాళోజీ నారాయణ రావుకు ఎమ్మెల్సీ కవిత నివాళుల‌ర్పించారు.

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం- 2022కు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్‌ను స‌న్మానించి, అభినంద‌న‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌ మంత్రి శ్రీదేవి, టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి పాల్గొన్నారు.

- Advertisement -