మోదీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు: కవిత

126
kavithaa
- Advertisement -

ప్రజలకు ఉచితాలు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితింగా వ్యవహరిస్తోంని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్‌లో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాతో కలిసి కవిత పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఇద్దరికి పింఛన్‌ ఇచ్చే స్థాయిలో తెలంగాణలో సంపద పెరిగిందన్నారు. పింఛన్‌, రేషన్‌, షాదీ ముబారక్‌ వంటి పథకాలు ఇవ్వొద్దని ప్రధాని నరేంద్రమోదీ అంటున్నారని ఈసందర్భంగా కవిత గుర్తు చేశారు. ప్రధాని మోదీ రూ.10లక్షల కోట్లను తన మిత్రులకు పంచిపెట్టారని అన్నారు. ఎదో ఒక కారణంతో పథకాలను అమలు చేయకుండా చేయాలని కుట్ర జరుగుతోందన్నారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ మధ్య నిజమాబాద్‌కు వచ్చి రేషన్‌ షాప్‌లో మోదీ ఫొటో పెట్టాలని కలెక్టర్‌తో గొడవ పడ్డారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఫొటో కచ్చితంగా దుకాణాల వద్ద పెట్టాల్సిన అవసరం ఉందా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అలా అయితే పెట్రోల్‌ బంకుల వద్ద యూరియా బస్తాల మీద మోదీ ఫొటో కచ్చితంగా పెడతామన్నారు. రాష్ట్రంలో ఒకరకమైన ఆందోళనకర పరిస్థితులను సృష్టించాలని చూస్తున్నారు. వాట్సాప్‌లో వచ్చే వాటిని యువకులు ఖండించాలి. అలాంటి దుష్ప్రచారాల వల్ల యువకులను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ ఎ ఒక్క ధరలను పెంచలేదన్నారు. అన్ని రకాలపైన పన్నులు పెంచుకుపోతున్నారని మండిపడ్డారు. పక్కన ఉన్న మహారాష్ట్రలో పప్పులు పెట్రోల్‌ ఇతర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో మనం గమనించాలన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని ఆ నమ్మకం నాకుందన్నారు.

- Advertisement -