నీకంటే రౌడీ ఎవరూ లేరు.. బండి సంజయ్‌పై బాలసాని ఫైర్‌..

23
TRS MLC Balasani

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. ఈరోజు ఖమ్మం జిల్లాలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ మాట్లాడారు. ఖమ్మంలో ఎవరు రౌడీ..?? ఎవరు రాజ్యమేలుతున్నారు..?? నీకంటే రౌడీ ఎవరూ లేరు బండి సంజయ్ అని బాలసాని మండిపడ్డారు. సంస్కార హీనుడిగా బండి సంజయ్ మాట్లాడారు. ఖమ్మం ప్రజలు బీజేపీని నమ్మరు. ఈ దేశంలో మతం పేరుతో, విద్వేశాలతో రెచ్చగొట్టింది బీజేపీ అని దుయ్యబట్టారు.

బీజేపీలో పార్టీ మారిన లీడర్లు లేరా..?? ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చారు.. ?? అని ప్రశ్నించారు. జనం లేకపోవడంతో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు. బండి సంజయ్ వి చౌకబారు ఆరోపణలు. కేంద్రం నిధుల మీద, గత ప్రభుత్వాల అభివృద్ధి బండి సంజయ్ చర్చకు సిద్దమా ..? ఎమ్మెల్సీ సవాల్‌ చేశారు. బండి సంజయ్ కి పిచ్చిపట్టింది. ఖమ్మం కార్పోరేషన్‌లో బీజేపీ జెండా ఎగరకుంటే ఎంపీ పదవికి, రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేస్తారా ..?? ఖమ్మంలో జరిగిన అభివృద్ధి కనబడని బండి సంజయ్‌కి కళ్లు ఉన్నట్టా లేనట్టా..? బండి సంజయ్ మాటలు శుద్ధ అబద్దాలు.. నీ నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే ప్రజల గుణపాఠం చెబుతారని ఎమ్మెల్సీ బాలసాని హెచ్చరించారు.