“సమ్మతమే” చిత్రం ప్రారంభం..

214
sammathame
- Advertisement -

యు.జి ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కె.ప్రవీణ నిర్మిస్తున్న “సమ్మతమే” చిత్రం హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన భువనగిరి ఎం.ఎల్.ఏ. పైలా శేఖర్ రెడ్డి క్లాప్ కొట్టగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హీరో, హీరోయిన్ లపై కెమెరా స్విచ్ ఆన్ చేసారు. పూజ కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ..ఈ చిత్రం 9వ తేదీ నుండి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తున్నాము.మార్చి మొదటి వారంలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాము.నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా మాకిచ్చిన ఫ్రీడంతో అనుకున్న టైంలొనే షూటింగ్ కంప్లీట్ చేస్తాము అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. యు. జి.ప్రొడక్షన్‌లో మేము తీస్తున్న మొదటి చిత్రం “సమ్మతమే”.ఈ టైటిల్ తగ్గట్టే ఈ మూవీ ఉంటుంది.జనం ముందుకి మంచి సినీమా తీసుకెళ్లాలనే తాపత్రయంతో ముందుకు వచ్చాము.ప్రజలందరూ ఆదరించే విదంగా మేము తీసే ఈ సినిమాను ప్రేక్షకులు అందరించి ఆశీర్వదించాలని అన్నారు.

హీరో మాట్లాడుతూ.. ఈ సినిమాకోసం మూడు సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాము.నేను ఇండస్ట్రీకి వచ్చి షాట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేసిన తరువాత నాకు ఫస్ట్ పరిచయమయ్యింది గోపినే.మా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్‌నును రాత్రి,పగలు కష్టపడి తయారుచేసుకొన్నాము.నేను నటించిన “రాజా వారు – రాణి గారు” సినిమా తర్వాత,”యస్.ఆర్.కల్యాణ మండపం” సినిమా షూట్ కంప్లీట్ అయ్యిపోయింది.నిన్నటితో “సెబాస్టియన్” మూవీ షూటింగ్ కూడా అయ్యిపోయింది.రేపటి నుండి ఈ సమ్మతమే షూటింగ్ మొదలవుతుంది.నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా డే అండ్ నైట్ వర్క్ దొరకడం చాలా హ్యాపీగా ఉంది.అలాగే చాందినితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.ఎందుకంటే ఇద్దరం షాట్ ఫిల్మ్ నుండే వచ్చాము.శేఖర్ చంద్ర పాటలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి.మేమంతా ఈ సినిమాను మీకెప్పుడు చూపిస్తామా అని చాలా ఎక్సయిటెడ్‌గా ఎదురు చూస్తున్నాము.ఈ “సమ్మతమే” పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం అని అన్నారు.

హీరోయిన్ మాట్లాడుతూ.. కలర్ ఫోటో తరువాత లుక్ అండ్ క్యారెక్టర్ పరంగా డిఫ్రెంట్‌గా ఉండే పాత్ర కావాలని ఎదురు చూసాను.అలాంటి మంచి స్క్రిప్ట్,మంచి డైలాగ్ లున్న బ్రిలియంట్ స్క్రిప్ట్ చెప్పడంతో ఈ మూవీ చేయడానికి ఒప్పుకున్నాను.సినిమాపై ఇంత డెడికేషన్,ప్యాసినెట్ ఉన్న దర్శక,నిర్మాతతో ఈ మూవీ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి.కథకు తగ్గట్టు ఉండే ఈ పాటలను ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని అన్నారు.

నటీ,నటులు:కిరణ్ అబ్బవరం,చాందిని చౌదరి
సాంకేతిక నిపుణులు:
ప్రొడక్షన్…యు.జి.ప్రొడక్షన్స్
కథ,కథనం,మాటలు,దర్శకత్వం.. గోపీనాథ్ రెడ్డి
నిర్మాత..కె.ప్రవీణ
సంగీతం..శేఖర్ చంద్ర
ఎడిటర్..విప్లవ్ నైశాడం
డి. ఓ. పి…సతీష్ రెడ్డి మాసం
ఆర్ట్…సుధీర్ మాచర్ల
పి.ఆర్.ఓ…వంశీ – శేఖర్

- Advertisement -