ఈ సాంగ్ చూస్తే కుర్రాళ్ల మతిపోవాల్సిందే..

409
Urvashi Rautela

బాలీవుడ్‌ బ్యూటీ, మిస్ ఇండియా ఊర్వశి రౌటేలా తెలుగులో హీరోయిన్ గా న‌టిస్తోన్న బ్లాక్ రోజ్. ఈ సినిమా సంపత్ నంది క్రియేషన్‌లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై మోహన్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ నుంచి నా త‌ప్పు ఏమున్న‌ద‌బ్బా ప్రమోషనల్ వీడియో సాంగ్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ సాంగ్ లో హీరోయిన్ ఊర్వశి తన అందంతోపాటు అద్భుతమైన డాన్స్ స్టెప్స్ తో విశేషంగా ఆకట్టుకున్నారు. 4 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ పాటకి జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. స్వతహాగా మంచి డాన్సర్ అయినా ఊర్వశి ఈ సాంగ్ లో కష్టమైన డాన్స్ మూవ్ మెంట్స్ తో అలరించడం విశేషం. ఈ పాట ప్రేక్షకులకు మంచి కిక్‌ ఇచ్చేలావుంది.

Black Rose - Naa Tappu Emunnadabbaa Video | Mani Sharma | Urvashi Rautela