- Advertisement -
సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పార్టీ దళిత ఎమ్మెల్యేలు ఎంపీలపై నిరాధారమైన ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలతో వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తూ పోస్టులు పెడుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం కోరింది. ఈమేరకు అడిషనల్ డీజీ జితేందర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. దళిత నాయకులను అవమానించేలా పోస్టులు పెట్టే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని వారు కోరారు.
- Advertisement -