మోదీకి పోస్ట్‌కార్డు రాసిన ప్రజాప్రతినిధులు

283
- Advertisement -

చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించనున్న జీఎస్టీని ఎత్తివేయాలని మోదీకి తెలుపుతూ కేటీఆర్‌ రాసిన పోస్ట్‌కార్డుకు విశేష స్పందన వస్తోంది. కేటీఆర్‌ చూపిన మార్గంలో రాష్ట్రంలో వివిధ నేతలు, ప్రజలు, ప్రజాసంఘాలు ప్రధాని మోదీకి పోస్ట్‌కార్డులు పంపిస్తున్నారు.

తాజాగా మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం గ్రామంలోని నేతన్నలు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రధాని మోదీకి పోస్ట్‌కార్డులు రాశారు. దశాబ్దాలుగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగాన్ని ఆదుకోవడం పోయి జీఎస్టీ పన్నుల భారంతో మరింత కృంగదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి బీ(టీ)ఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ ఎల్. రమణ ముఖ్య అతిథుగా హాజరై నేతన్నలకు మద్దతు తెలియజేశారు. అనంతరం జీఎస్టీ ఎత్తివేయాలని ఉత్తరాలను రాసి పంపించారు. సంస్థాన్ నారాయణపురం చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్‌ గాదరి కిశోర్ కుమార్ ప్రధాని మోదీకి పోస్ట్ కార్డును రాశారు.

- Advertisement -