జానారెడ్డిపై ఎమ్మెల్యే బాల్క సమన్ ఫైర్..

261
mla balka suman
- Advertisement -

నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి జానారెడ్డి చేసేందేమీ లేదని మండిపడ్డారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్. ఈ రోజు ఆయన హాలియాలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, కోనేరు కోనప్ప, పార్టీ నేత తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఈ మావేశంలో పాల్గొన్నారు.

శనివారం కాంగ్రెస్‌ పార్టీ ఆలియాలో జన గర్జన సభ నిర్వహించారు. దీనిపై ఎమ్మెల్యే సమన్‌ స్పందించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. అది జన గర్జన సభ కాదని.. జానా భజన సభ అని ఎద్దేవ చేశారు. జానా రెడ్డి 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్ననంటూ గొప్పలు చెప్పుకోవడమే కానీ ప్రజలకు ఏంచేస్తారన్నది చెప్పకపోవడం విచారకరమని సుమన్‌ అన్నారు.

జనారెడ్డి ఉమ్మడి ఆంధ్రపదేశ్‌ హయంలో 7సార్లు ఎమ్మెల్యేగా.. 4 సార్లు మంత్రిగా పనిచేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చేంతవరకు నల్గొండలో జిల్లాలో ఫోరైడ్‌ సమస్య ఎందుకు తీర్చలేకపోయారని జానారెడ్డిని బాల్క సమన్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఫోరైడ్‌ సమస్యను పోగొట్టింది నిజం కాదా అని సమన్‌ అన్నారు. జానారెడ్డిని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని చెప్పారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు టీఆర్‌ఎస్సేనని బాల్క చెప్పారు.

- Advertisement -