ఎన్నికలంటే మాకు టాస్క్- సీఎం కేసీఆర్

275
- Advertisement -

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘ సమావేశం జరిగింది. గులాబి పార్టీ రథసారథి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మేనిపెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపారు. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ వర్గాల నుంచి సుమారు 300లకు పైగా విన్నపాలు వచ్చాయని.. నాలుగేళ్లుగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తాము చేరుకోవాల్సిన గమ్యాలు చాలా ఉన్నాయని.. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం వేరు అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో పరిస్థితి అయోమయంగా ఉందని.. రాష్ట్రంలోని అన్ని పార్టీలు పొలిటికల్ గేమ్ అడుతున్నాయన్నారు.

మిషన్ కాకతీయకు, మిషన్ భగీరథకు 24వేల కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ అడిగితే కేంద్రం 24 రూపాయలు కూడా ఇవ్వలేదని.. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే అదనపు ఆదాయం ఏమీ లేదని చెప్పారు. మహారాష్ట్రకు కేంద్రం రూ. 15 వేల కోట్ల ప్యాకేజి ఇచ్చిందని.. వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల 30 వేల కోట్ల అప్పు చెల్లించాల్సి ఉంది. తెలంగాణలో రైతు రాజు కావాలి.. వ్యవసాయానికి పూర్వ వైభవం రావాలని సీఎం ఆకాంక్షించారు.

ఎన్నికలకంటే ఇతర పార్టీలకు గేమ్ అని.. ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలను ప్రజలకు వివరిస్తానన్నారు. రాష్ట్రం ఏర్పడిన పరిస్థితులు ఎవరికీ తెలియవని.. విద్యుత్, తాగునీరు, సాగునీరు తదితర సమస్యలుండేవన్నారు. గతంలో లాగే ఈ సారికూడా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని.. రైతు బంధు కింద ఎకరానికి రూ. 10వేలు ఇస్తామన్నారు. రైతు సమన్వయ సమితిలకు గౌరవ భృతి చెల్లిస్తామని.. 57 ఏళ్లు దాటినవారందరికీ పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు. ఆసరా పెన్షన్ల కింద వృద్దులకు రూ, 2, 016, వికలాంగుకు రూ.3,016, నిరుద్యోగ భృతి రూ. 3,016 ఇస్తామని సీఎం వివరించారు.

- Advertisement -