సవ్యసాచి మరో సాంగ్..

274
- Advertisement -

పెళ్లి తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య వరుస సినిమాలు చేస్తున్నాడు. అవి హాట్టా.. ఫట్టా అనేదానితో సంబంధం లేకుండా వరుసగా మూవీస్ చేసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. ఇక నాగ చైతన్య కంటే ఎక్కువ స్పీడ్ తో దూసుకెళ్తోంది అతని భార్య సమంత. వీరిద్దరూ ఎవరికి వారు సినిమాలు చేస్తూ థియేటర్లలో పోటీ పడుతున్నారు. అక్కినేని ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన అనంతరం సమంత హిట్ల మీద హిట్లు కొడుతూ అక్కినేనికి తగిన కోడలు అనిపించుకుంటుంది. నాగ చైతన్య కంటే ఎక్కవ సినిమాలు చేస్తూ సక్సెస్ సాధిస్తోంది.

నాగచైతన్య చేసిన శైలజా రెడ్డి అల్లుడు చిత్రంతో ప్రేక్షకులను కొంత వరకు ఆకట్టుకున్నాడు. తాజాగా చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య సవ్యసాచి అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది.

ఈమూవీ టైటిల్‌కు తగట్టుగా.. హీరో నాగ చైతన్య తన రెండు చేతులను సమర్థవంతంగా వాడి ప్రత్యర్థులను ఎదుర్కునే సీన్లను రూపొందించనున్నారు. చందూ మొండేటి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఇందులో మాధవన్, భూమికలు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.

ఇప్పటికే.. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌కు మంచి పాజిటీవ్ టాక్ రావడంతో తాజాగా ఒక్కరంటే ఒక్కరూ అనే మెలోడి సాంగ్‌ను విడుదల చేశారు. కీరవాణి సంగీతంలో రూపొందించిన వైనాట్ అనే సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు రాని ఓ సరికొత్త కథతో తెరకెక్కిస్తున్న ఈ సవ్యసాచి నవంబర్ 2న విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.

- Advertisement -