ఢిల్లీలో టీఆర్ఎస్ రైతు మహా ధర్నా..

167
kcr
- Advertisement -

తెలంగాణలో పండిన యాసంగి వరి ధాన్యం కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ ఇవాళ ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ మహా ధర్నా చేపట్టనుంది. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ నిరసన దీక్షలో పాల్గొనేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

ఎండవేడి ఎకువ ఉండటంతో దీక్షా స్థలి వద్ద కూలర్లు పెట్టారు. దీక్షకు వచ్చేవారందరికీ మజ్జిగ, మంచినీళ్లు, భోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండున్నర వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ మహా ధర్నా జరగనుంది. ఇక తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూపుతున్న వివక్షను, ఇక్కడి రైతాంగం పట్ల కేంద్రం అనుసరిస్తున్న కుట్రపూరిత విధానాలను సూటిగా ప్రశ్నించేలా దేశ రాజధాని ఢిల్లీలో హోర్డింగులు ఏర్పాటు చేశారు.

వడ్ల దీక్షకు తెలంగాణ భవన్‌ వద్ద 40 అడుగుల వేదికను నిర్మించారు. రెండు వేల మందికిపైగా ప్రతినిధులు కూర్చొనేలా వేదిక కింద ఏర్పాట్లు చేశారు. దీక్షా స్థలికి వచ్చే వారంతా కిందనే కూర్చోవాలి. కుర్చీలను వేయలేదు. తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపాలను వేదిక సమీపంలోనే ఏర్పాటుచేశారు. ప్రాంగణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూల దండలు వేసే ఏర్పాట్లు చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కూడా సోమవారమే కావటంతో దీక్షకు వచ్చేవారు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించే ఏర్పాట్లు ఉన్నాయి. దీక్ష ఉదయం పది గంటల నుంచి మొదలవుతుంది. తెలంగాణ భవన్‌కు పక్కనే ఉన్న నర్సింగ్‌ కళాశాలకు సంబంధించిన ప్రాంగణంలో భోజన ఏర్పాట్లు చేశారు.

- Advertisement -