నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం..

190
TRS LP Meeting To Be Held Today In Telangana Bhavan
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం(అక్టోబర్-27) నుంచి ప్రారంభం కానున్నాయి. గడిచిన మూడున్నరేళ్లుగా చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించు కోవాలని అధికార టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

ఇక ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతీ అంశానికి దీటుగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం,అధికార పక్షం టీఆర్ఎస్ ఇప్పటికే సిద్ధంగా ఉంది.

దీనిలో భాగంగా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసన సభాపక్షం సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహం పైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్న ట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షాలు ఇటీవల కాలంలో వివిధ అంశాలపై చేసిన ఆందోళనల నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేసినా, అసెంబ్లీ వేదికగా మరింత వివరంగా చెప్పేందుకు ఇది అందివచ్చిన అవకాశంగా భావిస్తోంది.

విప్‌ల పనితీరుపై కొంత అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ సారి ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే అంశంపై చర్చించి, సీఎం కేసీఆర్‌ వారికి ఎల్పీ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారని చెబుతున్నారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజుల పాటు సభ జరపాలని, కనీసం 4 వారాలు సమావేశాలు జరపాలన్న ఆలోచన ఉన్నందున, ఆ మేరకు అధికార పార్టీగా వ్యవహరించాల్సిన తీరుపై, సభ్యుల ప్రాతినిధ్యంపై ఈ భేటీలో చర్చిస్తారు.

- Advertisement -