ఆ హీరోయిన్ తో డీప్‌ లవ్‌లో.. నితిన్‌..?

486
Nitin in Deep Love with this Heroine
- Advertisement -

టాలీవుడ్లో సక్సెస్‌లతో దూసుకుపోతోన్న యంగ్‌ హీరోల్లో నితిన్ ఒకరు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు నితిన్‌. ఈ సినిమాలో నితిన్‌ సరసన మేఘఆకాశ్ నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘లై’ సినిమా చేశారు.

ఇదంతా బాగానే ఉంది. కానీ..సైలెంట్‌గా ఉంటూ తన పని తాను చేసుకొని పోయే నితిన్ ప్రేమలో పడ్డాడని, తనతో కలిసి నటించిన హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్నాడన్న వార్తలు నెట్టింట మాత్రం తెగ హల్‌చల్ చేస్తోన్నాయి.

Nitin in Deep Love with this Heroine

అంతేకాదు ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనీ .. అందుకు నితిన్ పేరెంట్స్ కూడా సానుకూలంగా వున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ హీరోయిన్‌ ఎవరో కాదు…’లై’ హీరోయిన్‌ మేఘఆకాశ్ . మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ..పెళ్లి ఆలోచన కారణంగానే మేఘ ఆకాశ్ వేరే సినిమాలను ఒప్పుకోవడం లేదని చెప్పుకుంటున్నారు.

అయితే ఇంతవరకూ ఈ ప్రచారాన్ని ఈ ఇద్దరిలో ఎవరూ ఖండించలేదు. సాధారణంగా ఒక హీరో – ఒక హీరోయిన్ వెంటవెంటనే సినిమాలు చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిదే ఈ ప్రచారం కూడా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నవాళ్లూ లేకపోలేదు.

- Advertisement -