తెలంగాణలో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటివరకు 63 స్ధానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వా ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను సాధించింది.
మహబూబ్ నగర్, వనపర్తి, మక్తల్, కొల్లాపూర్, అలంపూర్ లో టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు, వనపర్తిలో నిరంజన్ రెడ్డి 2 వేల ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. మక్తల్ లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ కు భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ నేతలు జానా,పొన్నాల,రేవంత్,సీపీఐ చాడ వెంకటరెడ్డి,పొన్నం ప్రభాకర్,గీతారెడ్డి వెనుకంజలో ఉన్నారు. జగిత్యాలలో రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ 6527 ఓట్లతో ముందంజ. పాలకుర్తిలో తొలి రౌండ్‌లో 2751 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు. పరకాలలో తొలి రౌండ్‌లో ఆధిక్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
టోంక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సచిన్ పైలట్ ఆధిక్యంలో ఉన్నారు. రాజస్థాన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కు విక్టరీ ఖాయంగా తోస్తోంది.మిజోరంలో ఎంఎన్ఎఫ్ లీడింగ్‌లో ఉంది. ఒక నియోజకవర్గంలో ఆ పార్టీ ముందంలో ఉన్నది.