- Advertisement -
దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. 12వ రౌండులో కాస్త వెనుకబడిన టీఆర్ఎస్… ఆ తర్వాత వరుసగా 13, 14 రౌండ్లలో ఆధిక్యతను చాటింది. 13వ రౌండులో 304, 14వ రౌండులో 288 ఓట్ల లీడ్ ను టీఆర్ఎస్ అభ్యర్థి సాధించారు.
ఈ నేపథ్యంలో 14వ రౌండు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యత తగ్గింది. 14వ రౌండులో టీఆర్ఎస్ కు 2,537 ఓట్లు రాగా, బీజేపీకి 2,249, కాంగ్రెస్ కు 784 ఓట్లు పడ్డాయి. 14వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ 3,438 ఓట్ల లీడ్ లో ఉంది. 15వ రౌండ్‌లో 955 ఓట్ల మెజార్టీ సాధించగా, 16వ రౌండ్‌లో 749 ఓట్లు సాధించింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేవలం 12వ రౌండ్‌లో ఆధిక్యం సాధించింది. 16 రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 1700 ఓట్ల మెజార్టీ మాత్రమే ఉంది.
- Advertisement -