ఆధిక్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వాణీదేవి..

282
Vanidevi
- Advertisement -

ఇటీవ‌ల తెలంగాణలో జ‌రిగిన‌ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. మహబూబ్‌నగర్‌ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రెండో రౌండ్‌ ముగిసే వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప అభ్యర్థి రామచందర్‌రావుపై 2,613 ఓట్లతో ఆధిక్యం సాధించారు. ప్రస్తుతం మూడో రౌండ్‌ కౌంటింగ్‌ కొనసాగుతోంది.

రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 17,732, బీజేపీకి 16,173, నాగేశ్వర్‌ 8,594, కాంగ్రెస్‌కు 4,980 ఓట్లు పోలయ్యాయి. అలాగే ఈ రౌండ్‌లోనూ 3,375 ఓట్లు చెల్లలేదు. రెండు రౌండ్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి 35,171 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 32,558 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 17,439 ఓట్లు రాగా, రాంచందర్ రావుకు 16,385 ఓట్లు వచ్చిన విష‌యం తెలిసిందే. రెండో రౌండ్‌లోనూ దాదాపు అంతే ఓట్ల తేడాతో వాణీదేవీ ముందంజ‌లో ఉన్నారు.

- Advertisement -