‘సుడిగుండాలు’లో నాగుర్జున.. వర్మ ట్వీట్‌..!

254
Ram Gopal Varma
- Advertisement -

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే దర్శకుడు రాం గోపాల్‌ వర్మ. ఈ దర్శకుడు నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. తాజా ఇయన టాలీవుడ్‌ కింగ్‌ నాగుర్జున గురించి ఆసక్తిరక విషయాన్ని వెల్లడించాడు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగ్‌ టాలీవుడ్‌లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. అయితే హీరో నాగార్జున తండ్రి నాగేశ్వరరావు సినిమాతో బాల నటుడిగా ‘సుడిగుండాలు’ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో వర్మ అక్కినేని అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తండ్రి నాగేశ్వరరావుతో నాగ్‌ నటించిన సుడిగుండాలు చిత్రంలోని ఓ సన్నివేశాన్ని తాజాగా వర్మ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశాడు. వర్మ ట్వీట్‌ చేస్తూ.. సుడిగుండాలు సన్నివేశం.. చంద్రశేఖరం ఆయన కుమారుడిని స్కూలుకి కారులో తీసుకేళ్లారు’ అంటూ వర్మ ఈ వీడియోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

- Advertisement -