ఎమ్మెల్సీల ఎన్నిక..లాంఛనం

189
trs mlcs kcr
- Advertisement -

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తైంది. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్-1లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. తొలి ఓటును స్పీకర్ పోచారం వేయగా రెండో ఓటును కేటీఆర్ వేశారు. ఇక చివరి ఓటును సీఎం కేసీఆర్ వేశారు.

మొత్తం ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు . వీరిలో టీఆర్‌ఎస్ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, ఎంఐఎం నుంచి మిర్జా రియాజుల్ హసన్, కాంగ్రెస్ నుంచి గూడూరు నారాయణరెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించడంతో టీఆర్‌ఎస్, ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లాంఛనమైంది.

మొత్తం 98 ఎమ్మెల్యేల్లో ముగ్గురు అభ్యర్ధులకు 20 మంది చొప్పున తొలి ప్రాధాన్యత ఓటు వేయగా మిగిలిన ఇద్దరు అభ్యర్ధులకు 19 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వేశారు.

- Advertisement -