సీపీఐ నేతలను కలిసిన కే కేశవరావు..!

631
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున కేసీఆర్ అదేశాల మేరకు సీపీఐ నాయకులను కలిశామని టీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు తెలిపారు. ఈ రోజు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేకేతో పాటు టీఆర్ఎస్ నాయకులు ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, వినోద్‌ కుమార్‌,సీపీఐ నేత చాడ వెంకట్‌ రెడ్డి లు పాల్గొన్నారు.

CPI

ఈ సందర్భంగా మీడియాతో కేకే మాట్లాడుతూ.. హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో సీపీఐ పోటీ చేయడం లేదని తెలిసి టీఆర్‌ఎస్‌కు మద్దత్తు ఇవ్వలని వారిని కోరాము. సీపీఐ రాష్ట్రంలో లేవనెత్తిన అన్ని సమస్యల పట్ల వారికి అన్నివిధాలుగా టీఆర్‌ఎస్‌ సపోర్ట్ చేసింది. యురేనియం,పోడు భూములు మొదలగున్న విషయాలపై వారితో మాట్లాడమని కేకే అన్నారు. హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో సీపీఐ రాష్ట్ర నాయకులు మాట్లాడుకుని టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.

సీపీఐ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సీనియర్ నాయకులు కే కేశవరావు తమను కలిశారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి వారితో పని చేశాం. కొన్ని ప్రజాసమస్యలపై చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ కొత్త చట్టాలు తీసుకురావాలని,యురేనియంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తాము ప్రతిపాదించాం. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం పని చేస్తాం. అయితే హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు విషయంలో తమ అధినాయకత్వంతో చర్చలు జరిపి 1వతేదీవరకు సీపీఐ పార్టీ అభిప్రాయం తెలుపుతాం అని చాడ తెలిపారు.

- Advertisement -