టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు..

249
TRS
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలు, గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలు, కులసంఘాల ఆశీర్వాద సభలు, డివిజన్లలో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, పార్టీలోకి వెల్లువలా చేరికల జోరు వెరసి గులాబీ ప్రచారం గుబాళిస్తున్నది. గ్రామగ్రామానా ఎక్కడ చూసినా టీఆర్‌ఎస్ శ్రేణుల సందడే కనిపిస్తున్నది. గులాబీ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ యస్ మండలం దాచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్, లీడర్స్‌ శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.

Jagadish Reddy

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది పార్టీల పంచాయతీ కాదు. తెలంగాణా ప్రజల బతుకుదేరువును నాశనము చేసిన జెండాలను బండకు కొట్టండి. తెలంగాణా రాష్ట్రంలో ప్రాజెక్ట్ ల నిర్మాణాన్ని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తా? వ్యవసాయాన్ని బతికిస్తేనే అందరం బతుకుతాం. 60 ఏండ్లుగా ఓట్లు వేసి గెలిపించిన పార్టీలు వ్యవసాయం గురించి ఏ ఒక్క రోజు ఆలోచించలేదు. రుణమాఫీ చెయ్యడం కాదు…అప్పు లేకుండా వ్యవసాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ వై.వి,సీనియర్ టి ఆర్ యస్ నేత కాకి కృపాకర్ రెడ్డి, ఆత్మకూర్ యస్ యం.పి.పి లక్ష్మీ బ్రాహ్మం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరుపమే రైతుబందు, రైతు భీమా పథకాలు.దేశంలో ఉచితంగా నిరంతర విద్యుత్ నందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణానే. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే సంక్షేమం. గులాబీ గూటికి చేరుదాం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలబడదామని మంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -